ఈ ఏడాది సంక్రాంతి కి విడుదలైన సినిమాలలో అతి పెద్ద హిట్ ఎఫ్ 2 . వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . అదే సమయంలో ఎన్ఠీఆర్ మహానాయకుడు , వినయ విధేయ రామ విడుదలైనా కూడా ఈ సినిమా పై ఎటువంటి ప్రభావం చూపలేదు . సినిమా మొత్తం అత్యంత వినోదపూరితంగా ఉండడం దీనికి ప్రధాన కారణం . దీనికి సీక్వెల్ గా ఎఫ్ 3 కూడా రూపొందిస్తామని అప్పుడే చిత్ర బృందం ప్రకటించింది . అయితే ఇప్పుడు ఈ చిత్రం కు అరుదైన ఘనత లభించింది . గోవాలో జరగబోయే 50వ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రదర్శనకు ఈ సినిమా ఎంపికైంది . ఈ వేడుకలో 76 దేశాలకు చెందిన 250 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి . ఈ లిస్టులో 26 ఫీచర్ ఫిలింస్‌లో ఎంపికైన ఏకైక తెలుగు సినిమాగా ఎఫ్ 2 అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది . ఈ వేడుక నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరగనుంది . తెలుగు లో అత్యంత ఆదరణ పొందిన ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయనున్నారని సమాచారం .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments