పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ నుండి విడిపోయినా ఎదో విధంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు . ఇటీవల తాను రెండొవ పెళ్లి చేసుకునాలకునే ఆలోచన సామాజిక మాధ్యామాల ద్వారా పంచుకోవడంతో పెద్ద సంచలనం సృష్టించింది . అయితే ఆమె ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పవన్ తో విడిపోయినప్పటినుండి ఆమె పూణే లో ఉంటూ పిల్లలను సంరక్షించుకుంటున్నారు . పిల్లల పుట్టినరోజు సమయాలలో పవన్ కళ్యాణ్ పూణే కు వెళ్లి వస్తుంటారు , ఆ సందర్భాలకు సంబంధించి ఫోటోలు కూడా బాగా వైరల్ అయినా విషయం విదితమే . అయితే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉండడంతో వారిని మెగా ఫామిలీ కి దూరం ఉంచకూడదనే ఉద్దేశంతో ఆమె హైదరాబాద్ కు మకాం మార్చే యోచనలో ఉన్నట్టు సమాచారం . ఈ సమయంలో తన పిల్లలు అకీరా నందన్ , ఆధ్యా మెగా ఫామిలీ దగ్గరగా ఉంటె వారికి కావలసినంత సపోర్ట్ లభిస్తుందని రేణు అనుకుంటున్నారట . అదీ కాక ఆమె తెలుగు లో పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా నిర్వహించడం వలన తరచూ పూణే నుండి హైదరాబాద్ రావడం వలన అధిక ఖర్చు అవుతుందని ఆమె భావిస్తున్నారట . ఇదే కనుక నిజమైతే రేణు దేశాయ్ పిల్లలతో సహా కొన్ని రోజులలో పూణే నుండి హైదరాబాద్ కు మకాం మార్చేస్తారన్నమాట .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments