చిరంజీవితో 151 వ సినిమా సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్నో వ్యయప్రయాసలోర్చి చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన విషయం తెలిసినదే . ఈ చిత్రానికి మూల కధ అందించినది పరుచూరి సోదరులు . పుష్కర కాలం క్రితమే కధ సిద్ధంగా ఉన్నా మెగాస్టార్ కు వీలుపడక సినిమా ముందుకు సాగలేదు . చివరికి అక్టోబర్ 2, 2019 న ఏకంగా ఐదు భాషలలో ఒకేసారి విడుదలై విజయపధంలో దూసుకుపోతోంది . అయితే చిత్రం విజయవంతం అయినా సందర్భంగా ఇటీవల చిత్ర బృందం థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసింది . ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అనేక ఆసక్తిగా విషయాలు వెల్లడించారు .

ఆయన మాట్లాడుతూ సైరా సినిమా కథను 2004లోనే మెగాస్టార్ చిరంజీవి తో ఈ సినిమా చేయాలనుకున్నామని… కానీ ఆ తర్వాత చిరంజీవి 2008లో రాజకీయాల్లో ప్రవేశించడంతో సినిమా వాయిదా పడిందన్నారు . అయితే ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి… ఈ సినిమా నాతో కాకపోయినా రామ్ చరణ్ తో తెరకెక్కిద్దాం అని చిరంజీవి మాతో తో అప్పట్లో చెప్పారని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు . దీని బట్టి చూస్తే చిరంజీవి ఇంకా రాజకీయాలలో కొనసాగి ఉంటె ఈ సినిమాను కచ్చితంగా రామ్ చరణ్ చేసేవారన్నమాట .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments