నన్ను పీవీపీ చంపేస్తాడు …

672

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పీవీపీ తనను చంపేస్తాడని , తనకి రక్షణ కల్పించవలసినదిగా జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించారు . ఇప్పటికే పీవీపీ బండ్ల గణేష్ అనుచరులు గత రాత్రి తన ఇంటిపై దాడి చేశారని బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారన్న విషయం తెలిసినదే . ఈ సందర్భంగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన బండ్ల గణేశ్, పీవీపీ తనను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు . రక్షణ కోసం తాను పోలీసులను ఆశ్రయించానని, ఉదయం నుంచి పీవీపీ అనుచరులు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని అన్నారు . ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని, పీవీపీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here