మెగాస్టార్ కథానాయకుడిగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి విజయవంతమైన విషయం విదితమే . ఈ చిత్రం విజయవంతం అవ్వడం చిత్ర బృందం అందరికీ ధన్యవాదాలు తెలుపడనాకి థాంక్యూ మీట్ ను ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ మాట్లాడారు . ఆయన మాట్లాడుతూ మొదటగా ఈ సినిమా తీయాలనే ఆలోచనకు నాంది పలికిన పరుచూరి సోదరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానాని , ఒక గురువు లాగా తమకు ఎన్నో సంవత్సరాలు తమ వెంట ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేసారు . అలాగే ఈ చిత్రానికి సంభాషణలు అందించి అందరి పాత్రలను ఎలివేట్ చేయడంలో ముఖ్య భూమిక పోషించిన బుర్ర సాయి మాధవ్ కు, ఈ చిత్రానికి వీ ఎఫ్ ఎక్స్ అందించిన కమల్ కణ్ణన్ కు , ఈ చిత్రానికి డీ ఓ పీ గా పనిచేసిన రత్నవేలు కు , ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ కు ధన్యవాదాలు తెలియజేశారు . అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన జగపతిబాబు కు , కథానాయికలుగా నటించిన నయనతార , తమన్నాకు రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలియజేశారు . ఎటువంటి ఒత్తిడిగా ఫీల్ అవ్వకుండా అందరిని సమకూర్చుకుంటూ తెరకెక్కించిన సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు రామ్ చరణ్ .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments