కుర్రహీరోలకు సవాల్ విసురుతున్న బాలయ్య …

505

నందమూరి బాలకృష్ణ , ఈ పేరు ఒక బ్రాండ్ . ఆయన ఏది చేసినా సంచలనమే . అయితే ఇప్పుడు బాలయ్య కుర్ర హీరోలకు సవాలు విసురుతున్నారు . ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు . విషయంలోకి వెళితే బాలకృష్ణ తన 105 వ సినిమా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే . ఇప్పటికే ఈ చిత్రంలో బాలయ్య లుక్ రెవీల్ అయ్యి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి . ఈ సినిమాలో బాలయ్య చాలా సన్నగా , యంగ్ గా కనిపిస్తున్నారు . అయితే బాలయ్య తన తదుపరి సినిమా బోయపాటి తో చేయనున్న విషయం తెలిసినదే

బోయపాటి – బాలకృష్ణ సూపర్ హిట్ కాంబినేషన్ . ఈ ఇద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి . అయితే అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య బోయపాటి సినిమాలో మరింత సన్నగా కనపడనున్నారట . ఈ సినిమా కోసం ఏకంగా బాలయ్య 25 కేజీలు తగ్గనున్నారు . దీనికోసం రోజుకు దాదాపు 5 గంటల పాటు జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు బాలయ్య . దీనికోసం వైట్ రైస్ పూర్తిగా మానేసి డైట్ లో కూడా చాలా చేంజెస్ చేసుకున్నారు బాలయ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here