మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2 వ తారీఖున విడుదలై ప్రపంచం నలుమూలల విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది . ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది . ఈ చిత్రం విజయవంతం అవ్వడం చిత్ర బృందం థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు .

ఆయన మాట్లాడుతూ తాను ఎప్పటినుంచో ఒక స్వాతంత్ర సమరయోధుడి పాత్ర పోషించాలని కోరికతో ఉన్నానని ,అప్పట్లో భగత్ సింగ్ పాత్ర పోషించాలనుకున్నా అది వీలుపడలేదన్నారు . పరుచూరి సోదరులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను పుష్కార కాలం క్రితమే తన దృష్టికి తీసుకువచ్చినా దానికి చాలా ఖర్చు అవుతుందని అందువలన తాము వెనక్కు తగ్గామని , చివరికి ఈ విధంగా ప్రేక్షకుల ముందు తీసుకురాగలిగామని చిరు తెలియజేశారు .

ఇంకా మాట్లాడుతూ కాఫీ లు అందించే బాయ్ నుండి ప్రతి ఒక్కరు రెండున్నర సంవత్సరాలు పాటు చాలా కష్టపడి ఈ సినిమాకి పని చేశారని అన్నారు . రామ్ చరణ్ ధ్రువ చూసిన తరువాత ఈ సినిమాకు సురేందర్ రెడ్డి అయితే సరైన న్యాయమును చేయగలడని అనుకోని సురేందర్ రెడ్డిని సంప్రదించామని , వెంటనే సురేందర్ రెడ్డి కొంత సమయం తీసుకొని కధకు కధనాన్ని జోడించి సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దాడని అన్నారు . ఖైదీ నెం . 150 తనను ఎంతో అందంగా ఒక 20 ఏళ్ల వెనక్కి వెళ్లినట్టుగా చూపించడంలో కెమెరా రత్నవేలు కృషి ఉందని , ఈ చిత్రంలో కూడా ఆ పాత్రకు తగ్గట్టుగా , ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చాలా అద్భుతంగా చిత్రీకరించాడన్నారు .

ఇంకా మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి వీ ఎఫ్ ఎక్స్ ప్రముఖ పాత్ర పోషించిందని సాధారణంగా పెద్ద ఎత్తున తీసే సినిమాకు రెండు నుంచి రెండున్నర వేళా షాట్స్ ఉంటాయని కానీ ఈ సినిమాకు 3800 వీ ఎఫ్ ఎక్స్ షాట్స్ ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉందని , ఈ షాట్స్ అన్నిటిని సమకూర్చి అద్భుతంగా రూపుదిద్దిన కమల్ కణ్ణన్ ధన్యవాదాలు తెలియజేశారు . ఈ సినిమాకు అద్భుతమైన సంభాషణలు అందించి ఈ సినిమా వేరే స్థాయి కి వెళ్లడానికి కారణం అయిన బుర్ర సాయి మాధవ్ కు చిరు కృతజ్ఞతలు తెలియజేశారు .

తాము అడిగిన వెంటనే కాదనకుండా తమనుంచి ఏమి ఆశించకుండా తన సొంత ఖర్చులతో వచ్చి అమితాబ్ బచ్చన్ నటించారని ఆయన ఋణం ఎప్పటికీ తీర్చుకోలేమని చిరు అన్నారు . ఇక అలాగే పొరుగు రాష్ట్రం అయినా కర్ణాటక నుండి వచ్చి నటించిన కిచ్చ సుదీప్ ,తమిళనాడు నుండి వచ్చి నటించిన విజయ్ సేతుపతికి , గొప్ప పాత్ర చేసిన జగపతిబాబుకు , తమన్నా మరియు నయనతారకు ధన్యవాదాలు తెలియజేశారు .

తన చిరకాల మిత్రుడు సాయి చంద్ ఈ సినిమాలో చిన్న పాత్ర అయిన చాలా శ్రద్ధతో చేశారని , మంచు పల్లకి తరువాత మళ్ళీ ఈ చిత్రంలో కలిసి నటించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు . ముందుగా ప్రేక్షకులందరూ తమన్నా నటనకు మెచ్చి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు , అంతగా ఆ పాత్ర అందరినీ కదిలించిందని చిరంజీవి అన్నారు .

మొట్టమొదటిసారిగా ఆంగ్లేయలను ఎదిరించిన యోధుడు తెరమరుగు కాకుండా ప్రతి ఒక్కరికి తేలియాలన్న ఉద్దేశంతో తాము ఈ చిత్రం రూపొందించామని , భారతీయులు ఎక్కడ ఉన్నా మొట్ట మొదటి స్వాతంత్ర సమరయోధుడు కథను తెలియజేయటానికి ఈ అవకాశం వచ్చినందుకు , ఈ సినిమాను నిర్మించినందుకు తాము ఎంతో గర్విస్తున్నామని అన్నారు . తన చిరకాల కోరికను నిజం చేసి తన కొడుకు రామ్ చరణ్ నిర్మించారని , తనకు ఇంతకంటే తనకు ఏం కావాలని అన్నారు . ఈ సినిమాకు సంబంధించి రివ్యూలను చూస్తుంటే చాలా భావోద్వేగానికి తాను లోనవుతున్నాని అన్నారు .
ఇంతగా అభిమానిస్తూ ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షక లోకానికి చిరు ధన్యవాదాలు తెలియజేశారు . అలాగే ఈ సినిమాకు సంబంధించి కాస్ట్యూమ్స్ విషయంలో పనిచేసిన సుష్మిత , అంజు మీనన్ అలాగే స్టైలిస్ట్ గా పనిచేసిన ఉత్తర మీనన్ కు అభినందననలు తెలియజేశారు . అలాగే ఏమి ఆశించకుండా చిన్న పాత్ర అయినప్పటికీ ఒప్పుకొని ఈ సినిమాలో నటించిన అనుష్క కు ధన్యవాదాలు తెలియజేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments