మెగాస్టార్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి . ఈ చిత్రం అక్టోబర్ 2 వ తారీఖున విడుదలై బ్లాక్ బస్టర్ గా కొనసాగుతోంది . సాధారణ ప్రేక్షకులే కాక చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . అయితే తాజా ఈ చిత్రం పై టాలీవుడ్ అందగాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించారు .

ఆయన ట్వీట్ చేస్తూ దృశ్యపరంగా సినిమా రిచ్ గా, అద్భుతంగా ఉందని, చిరంజీవిగారి నటన శిఖరసమానం అని ట్విట్టర్ లో స్పందించారు. ‘ సైరా’ తప్పక చూడాల్సిన సినిమా అని మహేశ్ బాబు పేర్కొన్నారు. నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిత్రయూనిట్ మొత్తానికి శుభాభినందనలు తెలిపారు . కళ్లు చెదిరే రీతిలో ఫొటోగ్రఫీ అందించారంటూ కెమెరామన్ రత్నవేలును ప్రత్యేకంగా ప్రస్తావించారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments