జనసేన పార్టీ 2014 లో స్థాపించబడినా ప్రజలు నుండి అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది . గత ఎన్నికలలో కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన మాట విదితమే . దీనితో జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు ఆ పార్టీ ముఖ్యనేతలు మల్లగుల్లాలు పడుతున్నారు . అయితే ఇప్పుడు ఈ పార్టీకి పెద్ద షాక్ తగిలింది . గత ఎన్నికలలో జనసేన తరపున అనకాపల్లి ఎంపీ గా పోటీ చేసిన చింతల పార్థసారధి పార్టీకి గుడ్ బై చెప్పారు . ఈయన గత ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ చాలా తక్కువ శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి . ఈయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు పంపారు . పార్థసారథిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఎంతో నమ్మకం ఉంచి ప్రభుత్వ పథకాల మానిటరింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించారు . అయితే కొంతకాలంగా పార్థసారథి పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది . ఈ నేపథ్యంలోనే పార్టీకి, మానిటరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా, పార్థసారథి ఏ పార్టీలో చేరతారన్నది ఇంకా స్పష్టం కాలేదు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments