సినీ రంగంలోకి ఒక కమెడియన్ గా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో ఒక ప్రముఖమైన నిర్మాతగా మారారు బండ్ల గణేష్ . ఆయనకు మెగా కుటుంబం అంటే ప్రత్యేకమైన అభిమానం , ఆ అభిమానాన్ని ఆయన అవకాశం దొరికినప్పుడల్లా చూపిస్తుంటారు . ఆయన మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించారు . విషయంలోకి వెళితే బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే 2014 అక్టోబర్ 1 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్వీట్ చేశారు . రామ్ చరణ్ ను లిటిల్ బాస్ గా పేర్కొంటూ , మళ్లీ మీతో ఓ సినిమా తీయాలనుందని, ఆ సినిమాను బ్లాక్ బస్టర్ గా ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. ‘లిటిల్ బాస్ నాకు త్వరగా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ బహిరంగ విజ్ఞప్తి చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments