తన వాక్చాతుర్యంతో , నటనతో , దర్శకత్వంతో అందరి మెప్పు పొందారు మహమ్మద్ షరీఫ్ . ఈయన దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేశారు . అయితే యువతలోని ప్రతిభను వెలికితీయడం కోసం ఒక వర్కుషాప్ ను మొదలుపెట్టనున్నారు . 30 రోజులపాటు సాగనున్న ఈ వర్కుషాప్ లో సినిమా , టీవీ రంగాలలోని అనుభవజ్ఞులైన సిబ్బంది చే యువతకు న్యూస్ రీడింగ్ , డైరక్షన్ , యాంకరింగ్ , ఎడిటింగ్ , స్క్రిప్ట్ రైటింగ్ , న్యూస్ రిపోర్టింగ్ , షార్ట్ ఫిలిం మేకింగ్ మొదలగు విభాగాలలో శిక్షణ అందజేస్తారు . ఈ శిక్షణా తరగతులు అక్టోబర్ 5 వ తారీఖు నుండి GIFT (గ్లోబల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫిలిం టెక్నాలజీ ) , ఖైరతాబాద్ నందు మొదలవుతాయి . ఈ వర్కుషాప్ లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు తాము రూపొందించే షార్ట్ ఫిలిమ్స్ మరియు సీరియల్స్ లో అవకాశం ఇస్తామని షరీఫ్ స్పష్టం చేశారు . కావున ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొనవలసినదిగా ఆయన కోరారు . ఆసక్తి కలిగిన వారు తనను 9441327504 ద్వారా సంప్రదించవచ్చని షరీఫ్ తెలియచేసారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments