సైరా టాక్

558

భారీ అంచనాల మధ్య అంతకంటే భారీగా సైరా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. చాలా చోట్ల ఇప్పటికే షోస్ కూడా పడిపోయాయి. అక్కడ్నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సైరాలో గూస్ బంప్స్ మూవెంట్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమాకు ఊహించినట్లుగానే మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా హిందీ విశ్లేషకుల నుంచి సైరాకు అద్భుతమైన టాక్ వచ్చింది. అక్కడి వాళ్లు మన సినిమాకు పడిపోయారు. అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు. కానీ మన దగ్గర చిరంజీవిపై ఉన్న అంచనాలు కావచ్చు.. మరే ఇతర కారణాలు కావచ్చు సైరాకు మంచి టాక్ వచ్చింది కానీ బ్లాక్ బస్టర్ మాత్రం కాదు. ముఖ్యంగా ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం మైనస్ గా చెబుతున్నారు.

ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా ఉయ్యాలవాడ జీవితాన్ని నెమ్మదిగా చూపించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. కానీ ఇంటర్వెల్ ఎపిసోడ్ రాజమౌళి రేంజ్ లో తెరకెక్కించాడని చెబుతున్నారు. అక్కడ్నుంచి సెకండాఫ్ మరో 50 నిమిషాల వరకు ఎక్కడా ఆగకుండా పరుగులు పెడుతుంది సైరా. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా క్లైమాక్స్ మళ్లీ ఊపిరి పోసిందంటున్నారు. ఎటు చూసుకున్నా కూడా సైరాలో గూస్ బంప్స్ మూవెంట్స్ చాలానే ఉన్నాయి. ఈ చిత్రం కచ్చితంగా కమర్షియల్ గా సంచలనాలు రేపడం ఖాయం. అంచనాలు మరీ ఆకాశంలో కాకుండా నార్మల్ గా వెళ్తే సైరా ప్రేక్షకులను సంతృప్తి పరచడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here