A2FP81 Rare studio photograph of Mahatma Gandhi taken in London England UK at the request of Lord Irwin 1931

ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపించడం గాంధీ నైజం. శాంతి, ఆహింసలే ఆయుధాలుగా మలుచుకొని బ్రిటిష్‌వాళ్లతో పోరాడి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మాగాంధీ. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా భారత స్వాతంత్య్ర పోరాటంలో మహాత్ముడు కీలక పాత్ర పోషించిన కొన్ని సంఘటనల పరిచయం ఇది.

మహాత్మా గాంధీ చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శం. 250 ఏళ్లకుపైగా బ్రిటిష్‌ పాలనలో మగ్గిన భారతీములు స్వేచ్ఛాగా గాలి పీల్చుకోవడానికి కారణం పోరాట పంథానే. గోపాల కృష్ణ గోఖలే పిలుపుతో 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌ తిరిగి వచ్చారు. మిగతా స్వాతంత్రోద్యమ నాయకులతో కలిసి బ్రిటిషర్లు భారత్‌ వదిలి వెళ్లేంత వరకు పోరాటం చేశారు.
చంపారన్‌ సత్యాగ్రహం

ఉప్పు సత్యాగ్రహం

ఉప్పు సత్యాగ్రహాన్నే దండి ఉద్యమం అని కూడాపిలుస్తారు. ఈ పోరాటం స్వాతంత్య్ర పోరాటంలో కీలకమైంది. దేశానికి మూడువైపులా సముద్రం ఉన్నా.. పన్నుల భారం కారణంగా ఎక్కవ ధర చెల్లించి ప్రజలు ఉప్పు కొనుగోలు చేసేవారు. దీనివల్ల ప్రజలు ఆగ్రహంగా ఉండడంతో 11 డిమాండ్లతో గాంధీజీ లార్డ్‌ ఇర్విన్‌కు లేఖ రాశారు. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఉప్పు చట్టాన్ని ఉల్లంఘిస్తామని హెచ్చరించారు. సబర్మతి ఆశ్రమం నుంచి 388 కి.మీ. నడిచి సముద్ర తీర ప్రాంతమైన దండి చేరుకున్నారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 6 వరకు 24 రోజులపాటు ఆయన పాదయాత్ర చేపట్టారు. ఆయనకు మద్ధతుగా ప్రజలు పాల్గొనడంతో దండి ఉద్యమం ఊపందుకుంది. సముద్రం ఒడ్డున పిడికెడు ఉప్పును చేతిలోకి తీసుకున్న గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ సందేశం దేశమంతటా చేరడంతో నగరాల్లోని ప్రజలు బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఏడాది తర్వాత గాంధీ-ఇర్విన్‌ ఒడంబడికలో భాగంగా ఉప్పుపై పన్నులను ఎత్తివేశారు. భారతీయులు ఉప్పు తయారు చేసుకోవడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం అనుమతిచ్చింది.

క్విట్‌ ఇండియా ఉద్యమం

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గాంధీజీ క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలువునిచ్చారు. బ్రిటిషర్లు భారతదేశం వదిలి వెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. యుద్ధం కోసం బ్రిటిషర్లు భారతీయులను ఆర్మీలో చేర్చుకుంటున్న సమయంలో గాంధీ ఈ పిలుపునిచ్చారు. భారతీయులు యుద్ధంలో పాల్గొనబోరని గాంధీ గట్టిగా చెప్పారు. బ్రిటిషర్లపై పోరాటాన్ని తీవ్రం చేసి స్వాతంత్య్రం సాధించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments