ఇప్పటికే ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో భారీగా దెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది . టీడీపీలో సీనియర్ నేతగా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన తూళ్ళ దేవేందర్ గౌడ్ కుమారుడు – టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్ గౌడ్ టీడీపీని వీడారు. ఇది తెలంగాణలో టీడీపీ కి పెద్ద షాక్గానే చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా – పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా – పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్ టీడీపీలో ఓ కీలక నేతగా ఎదిగారు. ఎన్టీఆర్ తో వ్యక్తిగత సంబంధాలు ఉన్న దేవేందర్ గౌడ్ చంద్రబాబుకు నమ్మినబంటుల్లో ఒకరు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments