జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ అధికార పక్షం వైఖరిని ఎండగడుతున్న విషయం విదితమే . అయితే తాజాగా పవన్ ప్రభుత్వం పై తనదైన శైలిలో మండిపడ్డారు . ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్లు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే కనిపిస్తున్నాయన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా? అంటూ ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. జగన్ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విమర్శలు సంధించారు. విద్యుత్ కోతలు ప్రస్తావన తీసుకొచ్చి ఇది రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్న దసరా కానుక అంటూ పవన్ ఎద్దేవ చేశారు. విద్యుత్ కోతలను నివరించడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ఏడాది వర్షాలు భాగనే కురిశాయి..వాస్తవానికి వర్షాలు బాగా పడినప్పుడు విద్యుత్ డిమాండ్ కూడా తగ్గుతుంది. సగటున రోజుకు 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుంది. ఈ విషయాన్ని నిపుణులు హెచ్చరించినప్పటికీ జగన్ సర్కార్ ఉత్పత్తి అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments