అ‍క్కినేని నటవారసుడిగా భారీ అంచనాలతో తెలుగు తెరకు పరిచయమైన అఖిల్ ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోయారు . Mr . Majnu కొంత పర్వాలేదనిపించినా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది . ప్రస్తుతం ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వడంతోటే స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నారు అఖిల్ . గీత గోవిందం సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న పరశురామ్‌ తరువాత మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నించాడు. దాదాపుగా ఓకే అను ప్రాజెక్ట్ ఆగిపోవటంతో ప్రస్తుతం అఖిల్ సినిమా మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments