దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ-20లో భారత్ మరో ఓవర్ మిగిలుండగానే విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి అర్ధసెంచరీ(72)తో చెలరేగడంతో మ్యాచ్ ఇండియా వశమయింది. ఓపెనర్ రోహిత్(12) త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ ధావన్(40)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు కెప్టెన్ కోహ్లి. ధావన్, పంత్ స్వల్ప వ్యవధిలో ఔటయినప్పటికీ శ్రేయాస్ అయ్యర్‌తో లాంఛనాన్ని ముగించాడు కెప్టెన్. ముఖ్యంగా కోహ్లి బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. అతడు ఆడిన కవర్ డ్రైవ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో, తాబ్రాయిజ్ షమి, ఫోర్టిన్ తలో వికెట్ పడగొట్టారు. విరాట్, ధావన్‌ల భాగస్వామ్యం ఇండియా విజయాన్ని ఖరారు చేసింది. దీంతో, మూడు మ్యాచ్‌ల టీ20 సరీస్‌లో ఇండియా 1-0 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
Subscribe
Login
0 Comments