తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో ‘బిగిల్’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ తన తదుపరి చిత్రంను యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పలు బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిన విజయ్ ఒక యంగ్ డైరెక్టర్ తో చేయబోతున్న నేపథ్యంలో అంతా కూడా అవాక్కవుతున్నారు. లోకేష్ చెప్పిన కథపై చాలా నమ్మకం ఉన్న కారణంగానే విజయ్ ఆ చిత్రంకు ఒప్పుకుని ఉంటాడని అంతా అంటున్నారు.

ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్ష వర్క్ లో లోకేష్ ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు నటీనటుల ఎంపిక చేసే పక్రియ మొదలు పెట్టాడు. విజయ్ హీరోగా నటించబోతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతిని విలన్ గా నటింపజేసేందుకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రయత్నిస్తున్నాడు. విలక్షణ పాత్రలను చేసేందుకు ఎప్పుడు ముందు ఉండే విజయ్ సేతుపతి తప్పకుండా ఈ చిత్రంలో విలన్ గా నటించేందుకు ఓకే చెప్తాడనే నమ్మకంతో తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఇటీవలే దర్శకుడు లోకేష్ స్వయంగా విజయ్ సేతుపతికి కథను వినిపించాడని విలన్ పాత్రను చేసేందుకు అడిగాడంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్ర బాగుంటే విలన్ గా కూడా నటించేందుకు ఎప్పుడు ఆసక్తిని చూపే విజయ్ సేతుపతి తప్పకుండా విజయ్ సినిమాలో విలన్ గా నటిస్తాడని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు విజయ్ సేతుపతి అధికారికంగా ఓకే చెప్పినట్లుగా సమాచారం రాలేదు. విజయ్ మూవీలో విజయ్ సేతుపతి నటిస్తే ఆ సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments