వరుణ్ తేజ్ – హరీష్ కాంబోలో తెరకెక్కిన వాల్మీకి సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. వాల్మీకి సినిమా మీద టైటిల్ వివాదం ఉన్నప్పటికీ.. సినిమాపై మాత్రం మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోయిన్ పూజ నటించడం, వాల్మీకి గా వరుణ్ లుక్స్ అన్ని మాస్ గా ఉండడంతో.. సినిమా పై ట్రేడ్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ మంచి ఇంట్రెస్ట్ ఉంది. అందుకే వాల్మీకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అనుకున్నదానికన్నా ఎక్కువగానే జరిగింది.

హీరో, హీరోయిన్ల క్రేజ్ తో …..

తాజాగా వాల్మీకి డిజిటల్ అండ్ శాటిలైట్స్ హక్కులను కూడా ఓ ప్రముఖ ఛానల్ 10 కోట్లకు కొనేసినట్లుగా తెలుస్తుంది. తెలుగులో పాపులర్ టివి ఛానల్ స్టార్ మా వాల్మీకి డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను గంపగుత్తగా 10 కోట్లకు చేజిక్కించుకున్నట్లుగా సమాచారం. హరీష్ శంకర్ డైరెక్షన్ స్కిల్స్, వరుణ్ క్రేజ్, పూజ క్రేజ్ అన్న సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. అందుకే స్టార్ మా మరో ఆలోచన చెయ్యకుండా 10 కోట్లకు ఆ రెండు హక్కులను కొనేసిందని చెబుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments