చిరు సై రా నరసింహారెడ్డి ట్రైలర్ కోసం మెగా ఫాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో… ఐదు భాషల ప్రేక్షకులు అంతే ఇదిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి సై రా నరసింహారెడ్డి ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదవుతుందా అని ఉదయం నుండి కౌన్ డౌన్ మొదలెట్టిన ఫాన్స్ కి ఆ ఆనంద క్షణం వచ్చేసింది. ఎన్నో అంచనాల మధ్యన సై రా ట్రైలర్ విడుదలైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సై రా ట్రైలర్ విజువల్ వండర్. యాక్షన్ సన్నివేశాల దగ్గరనుండి సినిమాలో నటించిన నటీనటుల లుక్స్ వరకు అన్ని అద్భుతః అన్న రేంజ్ లో ఉన్నాయి.

అలా మొదలయింది……

ఇక ట్రైలర్ లోకెళితే… సై రా నరసింహారెడ్డి.. బ్రిటిష్ వారిని తెగనరకడంతో మొదలయిన ట్రైలర్ లో.. సై రా నరసింహారెడ్డిని సంకెళ్లు వేసి బంధించి తీసుకెళుతుంటే…. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో నరసింహారెడ్డి సామాన్యుడు కాదు.. అతడొక కారణ జన్ముడు, అతనొక యోగి, అతనొక యోధుడు, అతనెవ్వరు ఆపలేరు.. అంటూ సై రా పాత్రలో చిరు లుక్స్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక సై రా నరసింహారెడ్డి పాత్రలో చిరు ఎంతో ఎనర్జిటిక్ గా.. ఎంతో పవర్ ఫుల్ గా చెప్పిన డైలాగ్.. ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము.. మీకెందుకు కట్టాలిరా శిస్తు అంటూ చెప్పిన భారీ డైలాగ్ ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. సై రా గురువు అమితాబ్ స్వాతంత్య్రం గురించి జరుగుతున్న తొలి యుద్ధమిది, ఈ యుద్ధం లో నువ్వు గెలవాలని సై రా ని ఉద్దేశించి చెప్పగా… నీ గెలుపుని కళ్లారా చూడాలి సై రా అంటూ కిచ్చ సుదీప్ పాత్ర చెప్పడం హైలెట్. వీరత్వానికి పేరుపడ్డ తమిళ భూమి నుండి వచ్చా.. రాముడికి లక్ష్మణుడి మాదిరిగా… మీతోనే ఉంటా.. అది విజయమో.. వీర మరణమే అంటూ విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్ కి గూస్ బంప్స్ వచ్చేసాయి.

లుక్ అదిరింది….

మరి చిరంజీవి సై రా లుక్ అన్నిటికన్నా హైలెట్. ఆయన ఎనర్జిటిక్ నటన, లుక్స్, డైలాగ్ డెలివరీ అన్నిటా సూపర్ అనేలా ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అనేలా ఉన్నాయి. దర్శకనిర్మాతలెక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తెరకెక్కించారు. అమితాబ్ గురు లుక్, నయనతార, తమన్నా ల లుక్స్, విజయ్ సేతుపతి పాత్ర, ఆయన లుక్స్, కిచ్చ సుదీప్ పాత్ర, లుక్స్ అన్ని అదరహో అనేలా ఉన్నాయి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ.. మెయిన్ హైలెట్ కాగా… బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరో హైలెట్. అచ్చంగా సై రా నరసింహారెడ్డి ట్రైలర్ విజువల్ వండర్ లా కనిపిస్తూ సినిమా మీద మరిన్ని రేట్లు అంచనాలు పెంచేలా చేసింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments