రాక్షసుడి పాత్రలో రాజు …

531

బాలీవుడ్ – టాలీవుడ్ లో ప్రస్తుతం ఒకటే హాట్ టాపిక్ గా నడుస్తుంది. అదే రామాయణం సినిమా గురించి. ఈ సినిమాను అల్లు అరవింద్ తో పాటు మధు మంతెన- నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇంత బడ్జెట్ తో సినిమా అంటే కచ్చితంగా అది అన్ని ఇండస్ట్రీస్ లో ఇండస్ట్రీ హిట్ అవ్వాలి. ఇక ఈ మూవీకి దంగల్ ఫేం నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్నారు.ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కాస్టింగ్ గురించే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఇందులో హృతిక్ – దీపిక జోడీ శ్రీరాముడు- సీతాదేవిగా నటిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే ఇదే ప్రశ్నను డైరెక్టర్ ని అడిగితే ” అవన్నీ ఇంకా రూమర్లు మాత్రమే. ఇంకా కాన్సెప్టు కి సంబంధించిన పనిలోనే ఉన్నామని కాస్టింగ్ గురించి ఇంకా ఆలోచించలేదని తెలిపారు” కాకపోతే వీరు బయటకు చెప్పకపోయినా హృతిక్ – దీపిక జోడీ శ్రీరాముడు- సీతాదేవి పాత్రలో నటిస్తున్నారు అని ప్రభాస్ రావణాసురుడి పాత్రలో నటించనున్నాడు అని తెలుస్తుంది. ఆల్రెడీ వీరిని ఒప్పించడం కూడా జరిగిందని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ భూమి మీద ఆగారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here