ఇటీవల ప్రపంచ ఛాంపియన్ షిప్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుపై తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడు మనసు పారేసుకున్నాడు. అంతేకాదు.. ఆమెతో తన పెళ్లి జరిపించాలంటూ ఏకంగా జిల్లా కలెక్టర్‌కు పిటిషన్‌ పెట్టుకున్నాడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సమావేశం సందర్భంగా మలైస్వామి అనే 70 ఏళ్ల వ్యక్తి.. ‘సింధు ఆట నన్నెంతో ఆకట్టుకుంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నా’నంటూ సింధుతో పాటు తన ఫొటోను జతచేసి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments