Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్స్ వాడే వినియోగదారులు ఒక ఫోన్ నుండి మరొక ఫోన్ కి చాలా వేగంగా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం SHAREIt అప్లికేషన్ మీద ఆధారపడతారు అన్న విషయం తెలిసిందే.

అయితే Google సంస్థ దీనికి ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైన అప్లికేషన్ తీసుకు వస్తోంది. FastShare అని పిలవబడే ఈ యాప్‌ని ప్రత్యేకంగా మనకు మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే అన్ని ఫోన్లలో గూగుల్ ప్లే సర్వీసెస్ ద్వారా ఆటోమేటిక్ గా ఇది ఇన్స్టాల్ చేయబడుతుంది.

దీని సహాయంతో మన ఫోన్లో ఉన్న పెద్ద మొత్తం లో ఫోటోలు లేదా వీడియోలు, ఇతర ఫైల్స్ మన దగ్గర్లో ఉన్న అనేక రకాల డివైజ్లకు సులభంగా షేర్ చేసుకోవచ్చు. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లు మాత్రమే కాదు, గూగుల్ క్రోమ్ బుక్స్, Wear OS Smart watchలు, iPhoneలకి కూడా మీ ఫోన్ లో ఉన్న డేటాని ఈ FastShare సదుపాయం ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది రెండు డివైజ్లకు మధ్య WiFi Direct కనెక్షన్ సృష్టించి, ఒక డివైస్ నుండి మరో డివైస్ కి ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా వేగంగా ఫైల్స్ ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది.

అతి త్వరలో Google Pixel 4 మార్కెట్లోకి విడుదల కాబోతున్న తరుణంలో ప్రస్తుతం మనం వాడుతున్న మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే మొట్టమొదట గూగుల్ పిక్సెల్ 4లో ఈ సదుపాయం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లకు గూగుల్ ప్లే సర్వీసెస్ ద్వారా ఆటోమేటిక్గా ఈ FastShare ఆప్షన్ అందించబడుతుంది. అప్పుడు ఎలాంటి థర్డ్-పార్టీ యాప్స్ మీద ఆధార పడాల్సిన పనిలేకుండానే సులభంగా డివైస్ ల మధ్య ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments