ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరు విడతల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 560 కోట్ల రుపాయలతో ఈ పథకం మొదలుకాబోతుందని సమాచారం. క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, కంటి అద్దాల పంపిణీ, స్క్రీనింగ్, ఇతర పరీక్షలు ఈ పథకం కింద జరుగుతాయని తెలుస్తోంది.

తొలి విడతలో వచ్చే నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. రెండో విడతలో నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు అవసరమైన విద్యార్థులకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని తెలుస్తోంది. 2020 సంవత్సరంలో మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో కంటి పరీక్షలు చేసి కంటి చికిత్సలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను రూపొందించనుంది. ప్రతి జిల్లాకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం అమలు చేయాలని సీఎం సూచించారు.తొలి విడతలో స్క్రీనింగ్ ద్వారా చికిత్స అవసరం ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి తదుపరి చికిత్స అందిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. సీఎం అధికారులకు రక్త హీనత, పౌష్టికాహార లోపంను అధిగమించాలని సూచించారు.

మహిళల కోసం రోజుకు 43 రుపాయలు, చిన్నారుల కొరకు రోజుకు 18 రుపాయలు ఖర్చు చేయటానికి సిధ్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోవటం, వాలంటీర్లు, సచివాలయాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవటం ద్వారా రక్త హీనత, పౌష్టికాహార లోపంను అధిగమించవచ్చని సీఎం అధికారులకు తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments