‘ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డాదమ్మో’ ఒకప్పుడు ప్రేక్షకుల్ని కట్టిపడేసిన పాట ఇది. ఇందులో శోభన్‌బాబు, శ్రీదేవిల కెమిస్ట్రీ, స్టెప్పులతో పాటు బిందెలు హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే పాట మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ న్యూ వెర్షన్‌లో వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్డే కలిసి చిందేశారు. నదీ తీరం, ఇత్తడి బిందెల నడుమ పాటను చిత్రీకరించారు. ‘వాల్మీకి’ చిత్రంలోని ఈ పాట ప్రోమోను యూనిట్‌ సభ్యులు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు హాజరయ్యారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

సాక్షాత్తూ దైవ స్వరూపులైన వేటూరి గారికి, స్వరదేవుడు చక్రవర్తి గారికి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ, పాటల మాంత్రికుడు దర్శకేంద్రుడికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ మీ అందరి కోసం ఈ పాట..’ అంటూ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ ప్రోమోను షేర్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here