రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈనెల 28 నుంచి దసరా సెలవులు వర్తించనున్నాయి. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 13 వరకు విజయ దశమి సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. తిరిగి స్కూళ్లు వచ్చే నెల 14న ప్రారంభం అవుతాయని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ప్రైవేటు జూనియర్‌ కాలే జీలకు ఈనెల 28 నుంచి వచ్చేనెల 9 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ఇంటర్‌ బోర్డు వర్గాలు వెల్లడించాయి. తిరిగి కాలేజీలు 10న ప్రారంభం అవుతాయని తెలిపాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments