మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను వేగంగా జరుపుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి చేసుకుందని టాక్. అయితే ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్‌కు చిత్రయూనిట్ పెద్ద పీట వేసిందట. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే ఎక్కడా రాజీపడకుండా బడ్జెట్‌కు వెనకాడకుండా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

సైరా చిత్ర గ్రాఫిక్స్‌కు ఎంత ఖర్చు చేస్తారో ఫిలింనగర్ నుంచి అందుతున్న సమాచారం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కేవలం గ్రాఫిక్స్‌కే దాదాపుగా రూ.45కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. సైరా నరసింహా రెడ్డి సినిమాకి 45 కోట్లు ఖర్చు చేస్తే ఇక సినిమాకు ఎంత ఖర్చు చేస్తారో అంచనా వేసుకోవచ్చు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 17 కంపెనీలకు చెందిన వారు డిజైన్ చేస్తున్నారట. ప్రతీ సన్నివేశం సహజసిద్ధంగా చూపించేందుకు వీరు బాగా కష్టపడుతున్నారని సమాచారం.

సైరా సినిమాలో బ్రిటీష్ కాలం నాటి సంఘటనలను, పోరాటాలను, క్లైమాక్స్ సన్నివేశాలను పెద్ద ఎత్తున్న చిత్రికరించారు. అయితే ఇప్పుడు సినిమా కు సంబంధించిన సన్నివేశాలను గ్రాఫిక్స్‌తో మరింత అందంగా, మరింత భయంకరంగా మలిచేపనిలో నిష్ణాతులైన టెక్నిషియన్స్‌తో పనిచేశారట. అయితే సైరా సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల రేపు జరుగనున్నది. తరువాత ఫ్రీ రిలీజ్ వేడుకలు ఎప్పుడు అధికారికంగా నిర్వహిస్తారో వేచి చూడాల్సిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments