ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ థ్యాంక్స్ చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని జగన్ ట్వీట్‌కు రీ ట్వీట్ చేశారు. ‘నా పుట్టిన రోజుకు శుభాకాంక్షలు తెలిపిన మీకు ధన్యవాదాలు జగన్ జీ’చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయాన్నే ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని, జీవితంలో మరిన్ని విజయాలు అందుకోవాలని, దేశానికి మరింత సేవ చేయాలని ఆకాక్షించారు జగన్.