మోటారు వాహనం చట్టంలోని నూతన నిబంధనలు వాహన చోదకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈ చట్టాన్ని స్వాగతించగా.. మరికొంత మంది పెదవి విరుస్తున్నారు. అయితే మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్‌బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలో ఇలాంటి ట్రాఫిక్‌ రూల్స్‌నే హీరో అమల్లోకి తెస్తాడు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ‘బెస్ట్‌ సీఎం భరత్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘ప్రభుత్వం ‘భరత్‌ అనే నేను’ సినిమాను ఆదర్శంగా తీసుకునే ఈ రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది’.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments