వైస్సార్సీపీ పార్టీలో రోజా ఫైర్ బ్రాండ్ ఉన్న మహిళా నేత. నగరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించింది. అయితే నిర్మాతగా.. దర్శకుడిగా.. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా ఉన్న తమ్మారెడ్డిభరద్వాజ ‘నా ఆలోచన’ అనే కార్యక్రమంతో సినీ, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారు. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాతో ఇంటర్వ్యూ నిర్వహించారాయన. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను రోజా నుండి రాబట్టారు తమ్మారెడ్డి భరద్వాజ.
కొత్తగా రెండోసారి గెలిచిన తరువాత ఎలా ఉంది అన్న ప్రశ్నకు రోజా స్పందిస్తూ , చాలా ఆనందంగా ఉంది. ఈ ఐదు సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో చాలా విషయాలపై ఫైట్ చేయడం వల్ల చంద్రబాబు నన్ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు.
అవన్నీ దాటి గెలిచి రావడం చాలా ఆనందంగా ఉంది. నటిగా నీకు వేధింపులు ఎదురయ్యాయా అన్న ప్రశ్నకు … నేను ఇంతకు ముందు కూడా చెప్పాను.
ఒక అమ్మాయి (శ్రీరెడ్డి) క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు నాకైతే అలాంటి కష్టాలు రాలేదని చెప్పా. ఫస్ట్ సినిమా నుండి నా జర్నీ చాలా స్మూత్‌గా సాగింది. కాంపిటేషన్ అయితే ఉంటుంది కాని.. వేధింపులు అయితే నాకు ఎదురుకాలేదు. నీకు నాలా ఎందుకు అంత నోటి దూల? అందర్నీ తిడతావు? అని తమ్మారెడ్డి అడిగినప్పుడు .. రోజా చెబుతూ దానివల్లే మనం బతుకుతున్నాం.. మన జోలికి ఎవరూ రావడం లేదు. బయటవాళ్లకు నేను ఫైర్ బ్రాండ్‌గానే అనిపిస్తా.. నాతో ఉన్న వాళ్లతో చాలా ఫ్రెండ్లీ నేచర్‌తో ఉంటా. చాలా కూల్ అని వాళ్లకు తెలుసు. కాకపోతే ఒక కవచం వేసుకుని తిరగాల్సి వస్తోంది.