తూర్పు గోదావరి

– కురసాల కన్నబాబు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన కురసాల కన్నబాబు.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మిపై 8,789 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

పాత్రికేయుని హోదాలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఆయన రాజకీయాల్లో కూడా అదే ఒరవడితో ముందుకు సాగారు.

ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గంలో చోటు సంపాదించారు.

ఆయనే కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.

ప్రజారాజ్యంతో రాజకీయం ప్రవేశం
జర్నలిస్ట్‌గా పనిచేసిన సమయంలో కన్నబాబుకు మెగాస్టార్‌ చిరంజీవితో ఏర్పడిన సాన్నిహిత్యం ఆయన పెట్టిన పీఆర్పీ వైపు అడుగులు వేసేలా చేసింది.

2009 ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారు.

ప్రజలతో మమేకమై చేసిన అభివృద్ధి ఫలితంగా 2014లో స్వతంత్య్రంగా పోటీచేసి కూడా 45 వేల ఓట్లు సాధించగలిగారు.

వైఎస్సార్‌ సీపీలో చేరిక
2015లో కన్నబాబు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కొంతకాలానికే ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు.

టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహించారు.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కన్నబాబును లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలకు దిగినా అవేవీ పనిచేయలేదు.

పార్లమెంట్‌ నియోజకవర్గాలుగా పార్టీని విభజించినప్పుడు కూడా కాకినాడ పార్లమెంటరీ అధ్యక్ష పగ్గాలు కన్నబాబుకే దక్కాయి.

ఇటీవల ఎన్నికల్లో కన్నబాబు నేతృత్వంలో కాకినాడ ఎంపీతోపాటు పార్లమెంట్‌ పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌ సీపీ విజయం సాధించింది.

వయస్సు : 46

విద్యార్హత: బీకాం, ఎంఏ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here