శ్రీపతి పండితారద్యుల బాల సుబ్రమణ్యం.. బహుశ ఈ పేరు ఇప్పటి అందరికి తెలియకపోవచ్చు.. SP బాలు అంటే.. అందరికి సుపరిచితమే.. ఆయనో పాటల పాఠశాల.. సుస్వరాల కళాశాల..నవరసాల పానసాల..పాటలు పడటంలో ఆయనది ఒక ప్రత్యేకమైన ఒరవడి..పాటల్లో ని భావాన్ని..సాహిత్యాన్ని..సంస్కృతిని ఆలోచనను ఆవేశాన్ని.. ఇలా ఏ రసానైనా..మేళవించి మూడు నిమిషాల పాటను మూడు తరాలు గుర్తుంచుకునే లా చేయగల గాన గంధర్వుడు sp బాలు.. నరవసాలు ఊరించే గాత్రం తీనెలూరే పాట కోయిల లు కూడా చెవులు కిక్కరించి వినేల పాడటం ఆయన స్పెషలిటీ.50 ఏళ్ళు గా ఆయన గాత్రం పడుతూనే ఉంది.. సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది..బాలు పాట.. అమృతం కన్నా.. తీయగా ఉంటుంది.. అతని పలుకులు బాష కు పట్టాభిషేకం చేస్తాయి.. ఎంతో సంగీత దర్శకులకు బాలు పాట.. ప్రయోగ శాల..

బాలు పాడితే.. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాయి.. అసలు బాలు పాటే.. ఓ రికార్డ్..ప్రపంచం లో నే అత్యధిక పాటలు పాడిన సింగర్ గా ఆయన.. గిన్నీస్ రికార్డ్లకి ఎక్కారు.. తరాలు మారిన స్వరాలు మారిన తెలుగు వారికి బాలు పాట..నిత్యనూతన మే..ఎలాంటి పాట ని అయిన.. అలుపు సొలుపు లేకుండా అలవోకగా పాడాగల ఆయన ఘంటసాల మాస్టారు వద్ద ఎవరు పాడితే ప్రశ్న కు సమాధానం గా దొరికారు..

ఘంటసాల తరువాత తెలుగు సినిమా సంగీతాన్ని దశబ్దాలు పాటు ఏలారు..తెలుగు పాటను శాసించారు బాలు.. ఇండస్ట్రీ కి అడుగుపెట్టిన తొలి నాళాల్లోనే.. చిన్న చిన్న హీరోలకి పాడిన బాలు అతి కొద్ది కాలం లో నే అగ్ర హీరోలందరికి స్వరాలు అందించారు.. ఎన్టీఆర్,ANR,శోభన్ బాబు,చిరంజీవి,అల్లు రామలింగయ్య.. ఇలా.. నటుడు ఎవరైనా సరే.. సినిమా ఏదయినా సరే.. అందులో బాలు పాట ఉండి తీరాలసిందే.. అయితే.. 1946 జూన్ 4 న పుట్టిన బాలు..మర్యాదరామ్మన్న సినిమా తో సినీ.. ఇండస్ట్రీ లో కి అడుగు పెట్టారు.. విరహాన్ని.. అద్భుతం గా పలికిస్తారు బాలు.. వయ్యాలను గొంతులో ఒలకిస్తారు..ఏ హీరో కి తగ్గట్టు.. వాయిస్ చేంజ్ చేసి.. గమ్మత్తుగా పాడటం.. ఆయన కి మాత్రమే సొంతం.. నిజానికి ఆ హీరోలే పాడారా ? అనేంత ఫీలింగ్ ని కలిగించిన ఘనత ఆయనకి మాత్రమే దక్కుతుంది.. ముఖ్యం గా అల్లు రామలింగయ్య కు,రాజ బాబు కు మాడా వెంకటేశ్వర రావు కు ఆయన పాడిన వైవిధ్యమైన పాటలని తెలుగు శ్రోతలు ఇప్పటికి మర్చిపోలేరూ.. అంతే.. కాదు.. కమలహాసన్ నటించిన.. ఇంద్రుడు చంద్రుడు చిత్రం లో గొంతుని మార్చి.. డబ్బింగ్ చెప్పడమే కాకుండా.. జీరా గొంతుతో.. ఓ పాటను కూడా పాడి.. తను ఏంటో.. తన సత్తా ఏంటో. నిరూపించుకున్నారు..
బాలు.. రాత్రికి రాత్రి గాయకుడు అయిపోలేదు..ఎవరి.. రికమండేషన్ తో సినీ ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇవ్వలేదు.. కేవలం ఆయన గాత్రం లోని వైవిధ్యంతోను.. గానం లో ని మాధుర్యం తోను.. అన్నింటి.. మించి.. సినీ పరిశ్రమలోకి అచ్చ తెలుగు పాటల ప్రవేశించారు.. బాల్యం నుంచే.. చక్కగా.. పాడటం నేర్చుకున్నారు..

ఖాళీ సమయం లో పాటలు పడేవారు.. ఈ ఆసక్తి తోనే ఆయన.. హార్మోనియం,ఫ్లూట్ వంటి సంగీత వాయిద్యాలు వించడాని నేర్చుకున్నారు.. టైఫాయిడ్ రావడం తో బాలసుబ్రహ్మణ్యం తన ఇంజినీరింగ్ చదువు మధ్యలో ఆపివేయాల్సివచ్చింది.. ఆ తర్వాత.. పలు పాటల పోటీల్లో పాల్గొని.. ఎన్నో.. అవార్డులను గెలుపొందారు..
ఆ టైం లో నే మద్రాస్ కు చెందిన తెలుగు కల్చరల్ organigastion నిర్వహించిన…సంగీత.. పోటీలో పాల్గొని.. బాలసుబ్రహ్మణ్యం మొదటి బహుమతి గెలుచుకున్నారు.. ఈ గెలుపుతో ఈయన అందరి దృష్టిలో పడ్డారు.. ఈ నేపథ్యం లో నే.. సంగీత దర్శకులు కోదండపాని.. ఆయనకు సినిమాల్లో పాడేందుకు అవకాశం ఇచ్చారు..

1966 డిసెంబర్ 15 న శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం కోసం.. మద్రాస్ లో నీ.. vr గార్డెన్స్ థియేటర్స్ లో “ఏమి ఈ వింత మొహమో. ” అనే పాటను తొలిసారి గా సుశీలమ్మ.. పి.బి.శ్రీనివాస్,ఈలా పాట రఘుమయ్యతో కలిసి పాడారు.

అయితే..

‌బాలు ఇండస్ట్రీ కి అడుగుపెట్టిన టైం లో.. ఆయనకు v.రామకృష్ణ.. గెట్టి పోటీ ఇచ్చేవారు.. ఆయన్ను.. ఘంటసాల కు వారసుడి గా భావించేవారు.. అందుకు ఇండస్ట్రీ లో అందరూ రామకృష్ణ తో పాడించుకోవాలని.. అనుకునే వారు..దాంతో.. బాలు carrier ప్రశ్నతకంగా మారింది.బాలు.. carrier బిగినింగ్ లో చిన్న చిన్న హీరోలకు కమెడియన్స్ కు ఎక్కువ గా పడేవారు..

‌ఘంటసాల వాయిస్ కు దెగ్గరగా.. ఉండటం చేత అగ్ర హీరోలంతా రామకృష్ణ చేతే పాడించుకునేవారు.. కొన్నాళ్లు ఇది బాలు ను చాలా బాధించింది.. ఏం చెయ్యాలో తెలియని టైం లో sp కోదండపాని ఇచ్చిన అద్భుత సలహా మేరకు అగ్ర హీరోలకు గొంతును అనకరించడం మొదలు పెట్టారు బాలు.. ఇది బాగా.. ఎఫెక్టివ్ గా పనిచేయడంతో.. అక్కడి నుంచి బాలు తన విశ్వరూపం చూపించారు.. అందరి హీరోలకు వారి వారి వాయిస్ లకు అంగుణం గా పాడటం మొదలు పెట్టిననాటి నుంచి.. బాలు ఇక వెనుతిరిగి చూసుకోలేదు..
‌అప్పటి నుంచి.. ఇప్పటి వరకు sp బాలు గారికి తెలుగు తెరమీద తనకు వేరే గాయకుడు లేడని నిరూపించుకున్నారు..
‌పాటడం తగ్గించేసిన.. ఇప్పటికి ఏ పాటైన.. ఇది బాలు పాడితే నే బాగుంటుంది.. అనిపిస్తే.. ఆ పాట బాలు ను వెత్తుకుంటు.. వచ్చేస్తుంది..

‌that is బాలు..

‌బాలసుబ్రహ్మణ్యం ఒక పాట పాడటమే కాదు.. చాలా సినిమాల్లో గెస్ట్ రోల్ దెగ్గర నుంచి.. కీ రోల్స్ వరకు ఎన్నో పాత్రలు పోషించి మెప్పించారు.. కాకపోతే.. ఆయన. కాస్త పుష్టి గా ఉన్నారు కాబట్టి.. ఎక్కువగా ఆయనకు కామెడీ పాత్రలే వచ్చేవి.. ఆయన సరే.. ఆ పాత్రను సమర్థవంతంగా పోషించి.. రక్తి కట్టించారు..

‌ఆ తరువాత.. జంధ్యాల మల్లెపందిరి లో ఒక కామెడీ ప్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించి.. నవ్వులు పూయించారు..
‌ఇక ఆ తర్వాత పక్కింటి అమ్మాయి.. సినిమా లు కథను మలుపు తిప్పే.. కీ రోల్ పోషించారు..అక్కడి నుంచి.. వివాహ భోజనంబు.. ప్రేమ,పర్వతాల పానకాలు, రాజహంస,చిరుజల్లు,పవిత్రబంధం లాంటి ఎన్నో సినిమాల్లో.. మంచి మంచి పాత్రలు పోషించి.. ఆకాటుకున్నారు..
‌అంతే కాదు..తమిళ్ సినిమాల్లో కూడా నటించి తన సత్తా చాటుకున్నారు.. sp బాలు.. సంగీత దర్శకుడు గా కూడా మెరుపులు మెరిపించారు.. కేవలం.. తెలుగు చిత్రాలకే కాకుండా.. తమిళ,కన్నడ,చిత్రాలకు తన భానిలను అందించి.. అక్కడి శ్రోతల్ని.. ఉరూతలుఊగించారు.. సంగీత దర్శకుడి గా.. 40 సినిమాలకు పని చేసారాయన..

‌ఇక ఆయన బిరుదులు చెప్పుకుంటే..

‌హ! ఒకటా.. రెండా.. ! బొలెడ్డాన్నీ.. !!
‌సినీ పరిశ్రమ కు ఆయన చేసిన సేవలకు.. ఎన్నో.. బిరుదులు.
‌ఆయన్ను దరిచేరి.. గౌరవాన్ని సంపాదించాయి..
‌5 దశాబ్ధాల సినీ కారియర్ లో 15 భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారు..

‌4 భాషల్లో జాతీయ సినీ అవార్డులను అందుకున్న దేశం లో ఏకైక సినీ నేపద్యగాయకుడు బాలసుబ్రహ్మణ్యం.
‌అత్యధికంగా పాటలు పాడిన సినీ నేపధ్య గాయకుడిగా సైతం బాలు.. రికార్డులు సృష్టించారు..

‌ఆయన ప్రతిభాటవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం… పద్మ శ్రీ.. పద్మభూషణ్.. అవార్డ్ ల ను అందజేసి ఘనంగా సత్కరించింది.
‌గాయకుడిగా నే కాకుండా.. నటుడి గా.. సంగీత దర్శకుడిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయా. విభాగాలలో 29 సార్లు నంది అవార్డుల పురస్కారాన్ని అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గానగంధర్వుడు..

‌ఇప్పటికి.. sp బాలు గారి పాటలు ఎంతో.. మాధుర్యం ఉంటుంది.. ఏ పాట పాడిన అందులో.. అదృత నిండి ఉంటుంది..

‌వయసు ఎంత పెరిగినా.. ఆ గొంతులో అనువంత అపశృతైన పలకదు.. అందుకే.. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలుపుకొని రికార్డుల స్థాయి లో 40 వేలకు పైగా.. పాటలు పాడి శ్రోతల్ని ఉరూతలుగుంచారు..Subscribe
Notify of
guest
1 Comment
Most Voted
Newest Oldest
Inline Feedbacks
View all comments
Kiran
Kiran
1 year ago

Nice