భీకర గాలులతో కూడిన వర్షం విజయవాడలో బుధవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు నగరంలో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో వేదిక పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. వేదికపైన వేసిన పరదాలు పూర్తిగా ఎగిరిపోయాయి. వర్షం కారణంగా ప్రాంగణమంతా బురదమయంగా మారింది. రాత్రి 1.30 గంటలకు గాలులు, వర్షం తెరిపి ఇవ్వగానే పార్టీ నేతలు, అధికారులు అక్కడికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. మైదానంలోకి ఇతరులు ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments