ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారకార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి షెడ్యూల్‌ ఖరారైంది. అయితే వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందే కెసిఆర్‌ విజయవాడకు రానున్నారు. 29న కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుకుంటారు. బుధవారం రాత్రి విజయవాడలోనే బస చేసి మరుసటి రోజు ఉదయం కనకదుర్గమ్మను దర్శనం చేసుకుంటారు. అనంతరం జగన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments