ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై అసెంబ్లీ స్థానాలు,ఇరవై రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలు వర్గాల నుండి అభినందనల వర్షం కురుస్తుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తనదైన శైలీలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ’వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చేసింది ఒక రోజు ఎన్నికల సమరం కాదు. పదేళ్ల యుద్ధమని’ ఆయన అన్నారు.తన తమ్ముడు ఉమా శంకర్ గణేష్ రాష్ట్రంలోని విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజక వర్గం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగాడు. నేను ఈ ఎన్నికలు చాలా టఫ్ గా ఉంటాయని భావించాను.
కానీ వార్ మాత్రం వన్ సైడ్ అయింది. తన దృష్టిలో జగన్ అంటే లయన్ కింగ్ అని పూరీ తెలిపారు.ఆయన ఇంకా మాట్లాడుతూ’వీలైతే జగన్ జీవిత చరిత్రపై,పోలిటికల్ కేరీర్లో ఆయన ఎదుర్కోన్న అటుపోటుల గురించి బయోపిక్ తీస్తా ‘అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Subscribe
Login
0 Comments