ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహాన్ రెడ్ది ఈ నెల ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో అందుకుతగ్గట్లు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోన్నారు అధికారులు. అయితే ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే రోజే తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

అయితే తాజాగా తొమ్మిది మంది కాదు ముగ్గురే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అందుకు ముగ్గురుకు మంత్రిపదవులు ఖరారైనట్లు సమాచారం.ఈ క్రమంలో గుంటూరు జిల్లా నుండి ఎమ్మెల్సీ కోటాలో మర్రి రాజశేఖర్,మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,ఒంగోలు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవులు ఖరారైనట్లు వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ఈ ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments