వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఉదయం నుంచే పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌ నుంచి ఆయన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి వచ్చారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గురువారం ఉదయం తాడేపల్లికి రానున్నారు. బుధవారం జగన్‌తో పాటు వైకాపా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కూడా వచ్చారు. ఓట్ల లెక్కింపు సరళిని వీరిద్దరూ తాడేపల్లి నుంచే పార్టీ అభ్యర్థులు, నేతలతో సమీక్షించనున్నారు. మరోవైపు పరిస్థితులన్నీ వైకాపాకు అనుకూలంగా ఉన్నాయని జగన్‌ నివాసం వద్ద నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments