ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దాదాపు 70 స్థానాల్లో తొలి రౌండ్, మరో 20కిపైగా స్థానాల్లో రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగా, 70కి పైగా స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖులైన అభ్యర్థులంతా 1,200 నుంచి 2,500 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. ఇప్పటివరకూ 93 స్థానాల ట్రెండ్స్ వెలువడగా, తెలుగుదేశం 18, వైసీపీ 74 స్థానాల్లో, జనసేన 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. రాజోలులో జనసేన అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments