ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇప్పటికే వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ మాత్రం 24 స్థానాల ఆధిక్యంలో ఉంది. దీంతో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం అయిపోయింది. ఈనేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్కు కేసీఆర్ ఫోన్
రాష్ట్ర సీఎం కేసీఆర్.. వైఎస్ జగన్కు ఫోన్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అద్భుత విజయం సాధించినందుకు కేసీఆర్.. జగన్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు రాష్ర్టాల మధ్య సంబంధాలు మెరుగవుతాయన్నారు.
కేటీఆర్ ట్వీట్
ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఎస్ జగన్కు అభినందనలు తెలిపారు. తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మీ కష్టానికి ఫలితం దక్కింది. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారని ట్వీట్ చేశారు. తమ సోదరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పాలనను సమర్థంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.