ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైంది. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘు రామకృష్ణం రాజు భీమవరం కౌంటింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్ధానాలకు ఏలూరు, భీమవరంలలోని మూడు చోట్ల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇలా తెలుసుకోవచ్చు
► ఎన్నికల సరళి, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక రౌండు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను కౌంటింగ్‌ కేంద్రం వద్ద మైక్‌లో వెల్లడించడంతోపాటు మీడియా ప్రతినిధులకు కనిపించేలా డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు.
ప్రతి రౌండు ఫలితాలను ‘సువిధ’ యాప్‌లో కూడా అప్‌లోడ్‌ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఫలితాలను తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను, యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. https:// results. eci.

gov. in వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ‘ఓటర్స్‌ హెల్ప్‌ లైన్‌’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా కూడా ఫలితాల సరళిని తెలుసుకోవచ్చు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments