సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాల ఫలితాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఈ పేజీలో అందిస్తున్నాం.

9.05

మచిలీపట్నం:599 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి.

9.00

జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల్లో పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజ.

అనంతపురం:

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ముందంజ. వైసీపీకి 341 ఓట్లు, టీడీపీకి 168 ఓట్లు.

8.50

ఖమ్మం:

తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు 3,159 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

నామా నాగేశ్వరావుకు (టీఆర్ఎస్) – 5,606 ఓట్లు, రేణుకా చౌదరికి (కాంగ్రెస్) – 2,447 ఓట్లు.

8.47

విశాఖ:

పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో టీడీపీ అభ్యర్థి భరత్‌ ఆధిక్యంలో నిలిచారు.

8.45

సికింద్రాబాద్:

పోస్టల్ బ్యాలెట్స్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ 1,086 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

8.30

వరంగల్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం:

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్ ఆధిక్యంలో ఉన్నారు.

8.00

ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలి దశ (ఏప్రిల్ 11) లో ఎన్నికలు జరిగాయి.

తెలంగాణలో 62.53 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 79.88 శాతం పోలింగ్ నమోదైంది.

ఈసారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజవర్గం నుంచి 185 మంది బరిలో నిలిచారు. దీంతో దేశవ్యాప్తంగా అత్యధికమంది అభ్యర్థులు పోటీ పడిన నియోజకవర్గంగా నిజామాబాద్ నిలిచింది.

ఈ నియోజకవర్గ ఫలితం రాత్రి 10.30 గంటల తర్వాత వెలువడొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు? దీనికి సంబంధించిన తాజా సమాచారం ఈ పేజీలో అప్‌డేట్ అవుతుంది గమనించగలరు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments