సక్సెస్ కానీ మెగా హీరోగా అల్లు శిరీష్ గట్టిగా వినిపిస్తోంది. విజయం కోసం ఆయన చేసిన మరో ప్రయత్నం విఫలమైంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో శిరీష్ నటించిన ఏబీసీడీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి.. ప్లాప్ టాక్ ని తెచ్చుకొంది. ఏబీసీడీ మలయాళ లో హిట్. ఐతే, హిట్ కథని కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి సరిగ్గా డీల్ చేయలేకపోయాడని రివ్యూలు చెప్పాయి.
ఈ నేపథ్యంలో శిరీష్ తన తదుపరి సినిమా కోసం పేరున్న దర్శకుడుని ఎంచుకొంటాడని అనుకొన్నారు. కానీ, ఆయన ప్లాపు దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. నితిన్ తో ఆ మధ్యన కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే డిజాస్టర్ చిత్రం డైరక్ట్ చేసిన ప్రేమ్ సాయి ని అల్లు శిరీష్ తదుపరి చిత్రానికి ఎంచుకున్నట్లు సమాచారం.
ఇది అల్లు అరవింద్ నిర్ణయం అని, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.