ప్రముఖ ఆర్‌జే, నటుడు, యాంకర్ హేమంత్ కారు ప్రమాదానికి గురైంది. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఆయన కారు ఓ గేదెను ఢీకొట్టింది. దీంతో ఆయన కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆయన సురక్షితంగా బయటపడ్డాడు. కాగా విజయవాడలో శనివారం ‘మహర్షి’ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments