నరసాపురంలో నాగబాబు ఒడిపోతున్నారా?

0
147

ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు బ్రదర్స్ ఎన్నికల బరిలోకి దిగారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి నైతికంగా మద్దతు ఇస్తున్న ఆయన సోదరుడు, సినీ నటుడు నాగబాబు… జనసేనలో చేరి… నరసాపురం నుంచి లోక్‌సభ బరిలోకి దిగారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే భీమవరం అసెంబ్లీ స్థానం ఉండటంతో… జనసేన వ్యూహాత్మకంగానే నాగబాబును ఇక్కడి నుంచి బరిలోకి దింపింది. ఎందుకంటే భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీకి దిగారు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రభావం ఉంటుందన్నది జనసేన అంచనా వేస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జనసేనకు కలిసొస్తుందని… నాగబాబు బరిలో ఉంటే నరసాపురం లోక్‌సభ సీటును కూడా గెలవచ్చనే ప్లాన్‌తోనే ఆ పార్టీ అక్కడ నాగబాబును బరిలోకి దింపింది. అయితే పవన్ కల్యాణ్ గెలుపుతో పాటు… నరసాపురం ఎంపీగా నాగబాబు విజయం కూడా తథ్యం అని అనేక సర్వేలు తేల్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా చెప్పిన సర్వే వివరాలు జనసేనకు లేనిపోని అనుమానాలు తెచ్చిపెడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here