గాలి తగ్గని టైరు …

783

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు 2019  ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటున్న హాట్ టాపిక్ . ఈ నెల 23 వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి . అయితే విజయం ఎవరిదీ అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది . పోయిన ఎన్నికల కంటే ఈ ఎన్నికలు ఇంకా రంజుగా జరిగాయని చెప్పొచ్చు , పోయిన సారి తెలుగుదేశం కు మద్దతు గా నిలిచిన పవన్ కళ్యాణ్ ఈ సారి వామపక్షాలతో కలిసి బరిలోకి దిగడం , ఎప్పుడు లేని విధంగా అత్యధిక శాతం ఓటింగ్ నమోదవ్వడం వంటివి రాష్ట్ర రాజకీయాలలో వేడిని పెంచాయి.

ఆంధ్రప్రదేశ్ లో అధికార పీఠం కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతుండగా అత్యధిక అవకాశాలు మాత్రం కేవలం తెలుగుదేశం , వైసీపీ ల మధ్యనే అన్న మాట విదితమే . నిన్నటి వరకు ఎవరు అధికార పీఠం చేజిక్కించుకుంటారు అనే అంశం పై అనేక చర్చలు జరిగాయి . అయితే ఫలితాలు ఇంకొక 5 రోజులలో అనగా మాజీ రాజకీయ నాయకులు లగడపాటి రాజజోపాల్ తన ఫ్లాష్ సర్వే బృందం ద్వారా నిర్వహించిన ఫలితాలు వెల్లడించారు.

అయితే ఆయన సర్వే ప్రకారం ప్రజలు మళ్ళీ తెలుగుదేశానికే పట్టం కట్టారని అనుకోక
తప్పదు . ఆయన చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం 100 సీట్లకు పది అటు ఇటుగా సాధిస్తుందని , ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి 7 స్థానాలు అటు ఇటుగా 72 స్థానాలు సాధిస్తుందని , ఇక మొదటిసారిగా బరిలోకి దిగిన జనసేన కేవలం 5 నుండి పది స్థానాలకే పరిమితం అవుతుందని . ఆయన ఇంకా మాట్లాడుతూ తాను ఏ పార్టీ కి సంబంధించిన వాడిని కానని , ఎన్నికల ముందు , ఎన్నికల తరువాత ప్రతీ నెల తమ ఆర్జీ ఫ్లాష్ టీం సర్వే చేసిందని అన్నారు .

అయితే 2014 సార్వత్రిక ఎన్నికల అధికార , ప్రతిపక్షాల మధ్య కేవలం 2.8 ఓటింగ్ శాతం మాత్రమే ఉన్నదని , అయితే ఈసారి జనసేన కూడా పోటీ చేయడంతో ఈ రెండు పార్టీలకి ఓటింగ్ శాతం తగ్గిందని తెలిపారు . అయితే వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే తెలుగుదేశం మళ్ళీ విజయ పతాకం ఎగురవేయడం ఖాయమని చెప్పవచ్చు . అయితే ఈ నెల 23 వ తేదీన వెలువడే తుది ఫలితాలకై వేచి చూడక తప్పదు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here