జనసేన పార్టీ , ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక మార్పుకు నాంది . పవన్ కళ్యాణ్ ఏ బహిరంగ సభలోనైనా తాను పార్టీ స్థాపించింది కేవలం సీట్ల కోసం కాదని , రాజకీయాలలో మార్పు కొరకు అని చెప్తూనే ఉన్నారు . కానీ ఆయన అనుకున్న మార్పు జరుగుతున్నట్టు అనిపిస్తోంది . 2014 నుండి చూసుకుంటే ప్రభుత్వం ఏ విషయంలోనైనా నిర్లక్ష్యం చేసి తన దృష్టికి వస్తే వెంటనే పవన్ స్పందించి పరిష్కారానికై ప్రయత్నిస్తున్నారు .

సాధారణంగా ఒక కొత్త పార్టీ పెడితే వేరే పార్టీలలో ఉన్న నాయకులు వచ్చి చేరడం సాధారణం . అయితే జనసేన విషయంలో అది అంతగా జరగలేదని వాస్తవం . చాలా వరకు యువతకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశమిచ్చారు పవన్ , పైగా ఈ పార్టీలోకి మాజీ జే డీ లక్ష్మీనారాయణ వంటి వారు వచ్చి చేరడం ఆ పార్టీకి మంచి పేరును,  ఆంధ్ర రాజకీయాలలో పెను మార్పుకు కారణం అయ్యింది . ఈ రకంగా నిజాయితీ గలవారు చేరడం వాళ్ళ జనసేన పార్టీ అన్ని వర్గాల ప్రజలలో ఆలోచనను రేకెత్తించింది . ఈ 2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రజలకు మందు , డబ్బులు ఎరవేయకుండా నిజాయితీగా పోటీ చేసిన పార్టీ ఏమిటంటే అది జనసేన అనే చెప్పాలి . ఈ రకమైన రాజకీయాలు చేయడం వలన ప్రజల ఆలోచనా తీరులో పెను మార్పుకు నాంది పలికిందనేది వాస్తవం . అయితే ఈ విధంగా రాజకీయాలు కొనసాగిస్తే కనుక కచ్చితంగా అవినీతి రహితమైన రాజకీయాలు కొన్ని రోజులలోనే చూడవచ్చు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments