మన జూనియర్ నందమూరి తారక రామారావు ఈ సంవత్సరం తన పుట్టిన రోజు ను జరుపోకోవడం లేదని సమాచరం. వివరాలలో కి వెళితే తారక్ పుట్టిన రోజు ఈ నెల 20వ తేది. తన ఫ్యాన్స్ అందరు తన పుట్టిన రోజు సందర్భం గా ప్రతీ ఏటా చాల సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

అదే విధంగా చాల చోట్ల ఫ్యాన్స్ అందరు తమ అభిమాన హీరో సినిమాలను తెరలు మీద చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తారక్ కూడా ప్రతీ ఏటా తన పుట్టి రోజు ను ఘనంగా తన ఫ్యామిలి తో జరుపుకుంటారు. తన స్నేహితులు , ఇంకా ఇండస్ట్రీ లో సెలబ్రిటీస్ కు మంచి పార్టి కూడా ఇచ్చే వారు.

అయితే ఈ సంవత్సరం తారక్ పుట్టిన రోజు ని కేవలం ఫ్యామిలి తో మాత్రమే చిన్నపాటి గా చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడట.

దీనికి కారణం తన తండ్రి శ్రీ నందమూరి హరికృష్ణ గారు కాలం చేసి ఇంకా సంవత్సరం కుడా కాకపోవడం తో కుటుంబం ఇంకా మౌనం పాటిస్తూనే ఉంది.

తారక్ రాజమౌళి దర్శకత్వం లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నట్లు అందరికి విదితమే, రీసెంట్ గా షూటింగ్ లో తారక్ కు మోచేతికి గాయం కావడం తో సర్జరీ చేయవలసి వచ్చింది. ఈ సర్జరీ అయ్యిన తరువాత మళ్ళీ తారక్ తిరిగి షూటింగ్ లో పాల్గొనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఇంటర్నెట్ లో తమ లేటెస్ట్ స్టిల్స్ అండ్ అప్డేట్ల తో హల్ చల్ చేస్తుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments