మెగాస్టార్ చిరంజీవి , మోహన్ బాబు , వెంకటేష్, బాలకృష్ణ మొదలగు స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి భాను ప్రియ. సితార చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన భాను..మొదటి సినిమాతోనే అందరిని కట్టిపడేసింది. ముఖ్యంగా డైరెక్టర్ వంశీ తో ఎక్కువ సినిమాలు చేసి హిట్లు సాధించింది. ఈ నేపథ్యంలో వంశీ ప్రేమలో పడింది భాను. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటికే వంశీ కి పెళ్ళై..పిల్లలు ఉండడం తో భాను ఇంట్లో పెళ్లి కి ఒప్పుకోలేదట.

వంశీతో బ్రేకప్ తరువాత.. భరత నాట్య కళాకారిణి సుమతీ కౌశల్‌ కుమారుడు.. అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి అభినయ అనే అమ్మాయి పుట్టిన తరువాత మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు.

కొన్నాళ్ల క్రితం భాను భర్త గుండెపోటుతో మరణించారు. దాంతో 2003లో అమెరికా నుండి భానుప్రియ ఇండియా కు వచ్చి..మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె తల్లి , వదిన , అక్క పాత్రలతో పాటు పలు సీరియల్స్ లలో నటిస్తుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments