చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించటం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తోందని.. కనీసం టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. తన ఆగ్రహాన్ని..అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు..

చంద్రగిరి రీ పోలింగ్ పైన ఆగ్రహం..

టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిలో కేంద్ర ఎన్నికల సంఘం అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశించటం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా అన అసంతృప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు.

ఎన్నికల ప్రక్రియ దాదాపు చివరి అంకానికి చేరుకొని.. ఫలితాల కోసం ఏర్పాట్లు జరుగుతున్న వేళ..ఇటువంటి నిర్ణయం తీసుకోవటం పైన టీడీపీ నుండి అసంతృప్తి కనిపిస్తోంది. చంద్రబాబు తన లేఖలో ఎన్నికల సంఘ తీరును తప్పు బట్టారు. అసలు ఏ ఫిర్యాదు మేరకు చంద్రగిరి లో రీ పోలింగ్ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.

టీడీపీ నేతల వరుస ఫిర్యాదులు..

చంద్రగిరి అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు నిర్ణయం తీసుకోవటం టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు పార్టీ నేతల వరకూ అందరూ వరుసగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసారు. టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్‌, సీఎం రమేష్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఈ నిర్ణయం పైన అసంతృప్తి వ్యక్తం చేసారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే కనీసం పరిగణలోకి తీసుకోలేదని వివరించారు. వైసీపీ ఫిర్యాదు చేయగానే ఏకపక్షంగా రీ పోలింగ్‌కు ఆదేశించారని వివరించారు.

అసలు ఈ అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఈ నెల 19న రీపోలింగ్‌కు ముహూర్తంగా ఖరారు చేసారు. ఇక, ఇప్పుడు నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాయటంతో..దీని పైన ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో.. రీ పోలింగ్ కారణాలు ఏం చెబుతుందో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments