విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్ . మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు . ఇటీవలే ఈ చిత్రంలోని “నీ నీలి కన్నుల్లోని” పాట విడుదలై అందరి మన్ననలను పొందింది . అయితే ఈ చిత్రానికి సంబందించిన మరో పాట గురుంచి విజయ్ దేవరకొండ సాంగ్ అఫ్ ది ఇయర్ గా ప్రకటిస్తూ ఈ నెల 12 న విడుదల చేయనున్నట్లు తెలిపారు , అయితే ఈ పాట విడుదల 15 కు వాయిదా పడిన మాట తెలిసినదే . అయితే ఇప్పుడు ఈ పాట విడుదలై యువతరాన్ని ఊపేస్తోంది . కడలల్లె వేచె కనులే అంటూ సాగే ఈ పాట వినసొంపుగా ఉంది . ఈ పాటలు బట్టి చూస్తే విజయ్ , రష్మిక జాడీలో మరో హిట్ ఖాయం అని తెలుస్తోంది . ఈ పాటను రెహ్మాన్ రచించారు .

https://www.youtube.com/watch?v=pEGOFNxmqZo

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments